తక్కువ సమయంలోనే వంట

వంటింటి చిట్కాలు

Kitchen Tips
Kitchen Tips

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే మహిళకు ఇంటి పని, వంటపని, పిల్లల బాధ్యతలు చూసుకోవడం పెద్ద సవాలే. ఇంటి పని త్వరగా ముగించేద్దామంటే కాదు. ఇక మిగింది వంట. తక్కువ సమయంలోనే వంట గది నుంచి బయటపడాలంటే ఈ విషయాలు గుర్తుపెట్టుకుటే సరి…

  • బంగాళ దుంపలు ముక్కలుగా కోశారు. అంతలోనే ఆఫీస్‌ నుంచి ఫోన్‌. అప్పుడు బంగాళ దుంప ముక్కలను చల్లని నీళ్లున్న గిన్నెలో వేస్తే అవి రంగు మారవు.
  • టొమాటోపై తోలు త్వరగా రావాలంటే మరుగుతున్న నీటిలో పది సెకన్లు ఉంచి, వెంటనే వాటిని చల్లని నీళ్లలో వేయాలి.
  • పుదీనా ఆకులు తాజాగా ఉండాలంటే పూల మాదిరి వాటిని గ్లాసులో నీళ్లుపోసి అందులో వేయాలి.
  • నిమ్మకాయల నుంచి రసం పూర్తిగా రావాలంటే వాటిని మైక్రోవేవ్‌లో 15 సెకన్లు పెట్టాలి. దాంతో అవి మెత్తగా మారి, ఎక్కువ నిమ్మరసం వస్తుంది.
  • చపాతీలు మృదువుగా రావాలంటే పిండి కలిపేటప్పుడు కొద్దిగా పాలు కలిపితే సరి.