గణగణ గంటల నాదం

ఆధ్యాత్మిక చింతన

The ringing of the bells in the temple
The ringing of the bells in the temple

ఈ విశ్వంలో ఎక్కడైనా, ఏ దేవాలయాల్లోనైనా గుడి గంటలు లేని దేవాలయం ఉండదు. ప్రతి చిన్న కోవెలలో కూడా గంటలు తప్పనిసరి.భక్తులు దేవాలయ సందర్శన చేసే ముందు, దేవునికి నమస్కారం చేసే ముందు గంటలను మోగించడం ఆనవాయితీ, సంప్రదాయం కూడా.

మన గృహాల్లో కూడా దేవుడికి హారతి లేదా ఆగరుబత్తి వెలిగించి తిప్పేటప్పుడు గంట మోగిస్తూ ఉంటాం, ఈ గంట మోగించడం లో ఈ అర్ధం ఉంది. అందులో కోవెలలోని గంటలు మోగిస్తున్న ప్పుడు మన మనసు అంతా భగవంతునిపై కేంద్రకృతమై ఉంటుంది. ఆ గంట చేసే ధ్వని అటు భగవంతునికి ఇటు భక్తునికి ఆనందాన్ని ఇస్తుంది.

గుడి గంటల విశిష్టత ఏమిటంటే దేవతలు, దేవుళ్లు యోగ నిద్రలో ఉంటారు, ఉన్నా కూడా సర్వం గ్రహిస్తుంటారు. వారిని మేలుకొల్పడానికి మేము వచ్చామని భగవం తునికి తెలియపరచడం కోసం గంట నుం డి వెలు వడే శబ్దానికి రాక్షసులతో సహా దుష్ట శక్తులు పారిపోతాయి ఆ దుష్ట శక్తులు పారిపోవడానికి భక్తులు ఆలయంలోకి అడుగు పెట్టిన వెంటనే గంటలను మోగిస్తారు.

కోవెల గంటలకు ప్రతిధ్వనించే లక్షణం ఉంటుంది. ఆ శబ్ధ తరంగాలు తిరుగుతూ వ్యక్తి మష్కిషంలోకి చేరి మెదడు చైతన్యవంతం అవుతుంది. మరియు లయబద్ధమైన గంటావాదం వల్ల కంటికి కనిపించకుండా గాలిలో దాగి ఉండే రకరకాల వ్యాధికార సూక్ష్మక్రిములు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది.

ఆ గణగణ గంటల నాదంతో భక్తులకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఎన్నో వ్యాధులు ఆ కోవెల గంటల శబ్దానికి నయ మవతాయని, అందుకే ప్రభాత సమయాన కొంచెంసేపు సంగీత శబ్దాన్ని అస్వాదిస్తే మేలు.