క్రిమియా వంతెనను సందర్శించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌..!

vladimir-putin-drives-mercedes-across-crimean-bridge-months-after-blast

మాస్కోః రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వార్తలకు పుతిన్‌ చెక్‌ పెట్టారు. బాంబుదాడిలో దెబ్బతిన్న క్రిమియా వంతెనను సందర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మెర్సిడెస్‌ బెంజ్‌ కారును బ్రిడ్జిపై స్వయంగా నడుపుకుంటూ వంతెనను పరిశీలించారు.

ఉక్రెయిన్‌- రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అక్టోబరులో జరిగిన బాంబు దాడిలో ఈ వంతెన ధ్వంసమైంది. దీంతో ఈ వంతెనకి రష్యా మరమ్మతులు చేసి పునరుద్ధరించింది. 19 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనపై పుతిన్‌ స్వయంగా కారు నడుపుతూ ప్రయాణించారు. మరమ్మతుల్లో పాల్గొన్న కార్మికులతో మాట్లాడారు. ఈ దృశ్యాలను రష్యాకు చెందిన ఓ టెలివిజన్‌ ఛానెల్‌ ప్రసారం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/