కరోనా ఎఫెక్‌..వన్యప్రాణి వాణిజ్యంపై నిషేధం

China
China

బీజింగ్‌ : తమ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుగా వ్యవసాయ సంబంధిత వన్యప్రాణి వాణిజ్యంపై నిషేధం విధిస్తున్నట్లు చైనా వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆహారంగా స్వీకరిస్తున్న వన్యప్రాణులే కరోనా వైరస్‌కు మూలమన్న భావనతో చైనా ప్రభుత్వం ఈ నిషేధం విధించినట్లు తెలుస్తోంది. వన్యప్రాణులను సజీవంగా లేదా నిర్జీవంగా మాంసాహారం కోసం విక్రయించే మార్కెట్‌లు, సూపర్‌ మార్కెట్‌లు, రెస్టారెంట్లు, ఇకామర్స్‌ వేదికలపై జరిగే వాణిజ్యాన్ని, వన్యప్రాణుల రవాణాను నిషేధిస్తున్నట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ తన ఆదేశాలలో వివరించింది. ఇటువంటి జంతువులను పెంచుతున్న ప్రదేశాలను పూర్తి స్థాయిలో శుద్ధి చేయాలని అటవీ శాఖతో కలిసి విడుదల చేసిన ఈ సంయుక్త ప్రకటనలో వివరించింది. వుహాన్‌ నగరంలో వున్న రెండు సముద్ర ఆహారోత్పత్తుల మార్కెట్ల నుండి ఈ వైరస్‌ వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటి వరకూ చైనాలో 80 మందికిపైగా మృత్యువాత పడ్డారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/