కరోనాతో మృతి..రూ.కోటి ఎక్స్‌గ్రేషియా

ఢిల్లీలో కరోనాతో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి సిఎం కేజ్రీవాల్‌ రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Delhi CM Kejriwal
Delhi CM Kejriwal

న్యూఢిలీ: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్నా…ఢిల్లీ పోలీస్ శాఖలో పనిచేసే ఓ కానిస్టేబుల్ కరోనాతో చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. 31 ఏళ్ల కానిస్టేబుల్ అమిత్ కుమార్ భరత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. మంళవారం అనారోగ్యానికి గురికావడంతో రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రమే అమిత్ కుమార్ మరణించాడు. కరోనా ఉందేమోనన్న అనుమానంతో శాంపిల్స్‌ను పరీక్షలకు పంపగా.. పాజిటివ్ వచ్చింది. అమిత్ కుమార్‌కు భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. చనిపోవడానికి ముందు అతడికి దగ్గరగా మెలిగిన వారందరినీ క్వారంటైన్ చేశారు. మొదట చికిత్స అందించిన వైద్యులకు కూడా పరీక్షలు చేస్తున్నారు. కానిస్టేబుల్ మృతిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేకాదు అమిత్ కుమార్ ఫ్యామిలీ రూ. కోటి ఎక్స్‌గ్రేషియాను సిఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/