కంటైన్‌మెంట్‌ ప్రాంతాలో కరోనా నివారణ చర్యలు

పరిశీలించిన ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌బాబు

sahnitaization in  containment zone
sahnitaization in containment zone

హైదరాబాద్‌: వనస్థలిపురం ఏరియాలో ఒక్క సారిగా కరోనా కేసులు వెలుగులోకి రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. మూడు కుటుంబాలలోని 11 మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో వనస్థలిపురం పరిధిలో పలు కాలనీలను కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా ప్రకటించారు. వారం రోజులపాటు ఇక్కడ కఠిన చర్యలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ కంటైన్‌ మెంట్‌ ప్రాంతాలలో జిహెచ్‌ఎంసి అధికారులు నేడు కరోనా నివారణ చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాలలో హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారి చేశారు. ఈ ప్రాంతాలలో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌బాబు నేడు పర్యటించారు. కాలనీల్లో చేపడుతున్న చర్యలను పరిశీలించారు, ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గత వారం రోజుల వరకు హయత్‌నగర్‌ డివిజన్‌లో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా లేదన్నారు. దురదృష్టవశాత్తు మలక్‌పేటలోని గంజ్‌ కారణంగా వనస్థలిపురంలో కరోనా అలజడి రేపిందని అన్నారు. ప్రజలు ఎవరు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, వైరస్‌ నివారణకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారన్నారు. ప్రజలు ఎవరకు బయటకు రావద్దని, తప్పని సరిగా మాస్కులు ధరిచాలని అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/