ఏపిలో మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు

వాతావరణ కేంద్రం హెచ్చరికలు

rain fall
rain fall

ఏలూరు: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా మారి మరో రెండు రోజుల్లో ఏపిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు కురిసిన అకాల వర్షాల కారణంగా రైతులు ఎంతగానో నష్టపోయారని, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తమ పంటలను కాపాడుకోవాలని సూచించారు. ఈ నెల పదవ తేదినుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్త పడాలని, తుఫాన్‌ వచ్చే సమయాలలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/