ఎత్తిపోతల పథకాలకు సిఎం కెసిఆర్‌ శంకుస్థాపన

నెల్లికల్లు: సిఎం కెసిఆర్‌ నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా నెల్లికల్లు వ‌ద్ద 13 ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు సిఎం కెసిఆర్‌‌ శంకుస్థాపన చేశారు. ఈ ఎత్తిపోతల పథకాలతో హుజూర్‌నగర్‌, సాగర్‌, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని చివరి భూములకు కృష్ణా జలాలు అందుబాటులోకి రానున్నాయి.

ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.2,395.68 కోట్ల వ్యయంతో మొత్తం 13 ఎత్తిపోతల పథకాలతో పాటు పలుచోట్ల ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో 1,04,600 ఎకరాల టెయిల్‌లాండ్‌ భూములకు సాగునీరు అందించేందుకు 13 లిఫ్ట్‌ ఇరిగినేషన్‌ ప్రాజెక్టులను చేపడుతున్నారు. ఈ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో మండ‌లి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మంత్రులు జ‌గ‌దీశ్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్‌, ఎంపీ బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్‌, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, ర‌వీంద్ర నాయ‌క్‌తో పాలు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు.