అల్జీరియాలో తొలి కరోనా కేసు నమోదు

Algeria
Algeria

అల్జీర్స్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) మధ్యధరా తీరంలోని (ఉత్తరాఫ్రికా) అల్జీరియా దేశంలో తొలి కేసు నమోదైంది. అల్జీరియా రాజధాని అల్జీర్స్‌లో ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫిబ్రవరి 17 న అల్జీర్స్‌కు వచ్చిన ఇద్దరు ఇటాలియన్లకు పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఒకరికి పాజిటివ్‌ అని తేలినట్లు అల్జీరియా ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. సదరు వ్యక్తికి ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో చికిత్సనందిస్తున్నామని, ఇతర దేశాల నుంచి వస్తున్న వారికి అన్ని చెక్‌ పాయింట్ల వద్ద పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/