అక్రమ చొరబాటుదారులను పట్టిస్తే ..రూ.5వేలు

ప్రకటించిన చైనా అధికారులు

illegal intruders
illegal intruders

చైనా: దేశంలో కరోనాను నివారించాం. అని గత కోన్ని రోజలుగా చెబుతున్న అధికారులకు కొత్త తలనోప్పి చుట్టుకుంది. తగ్గిందనుకున్న వైరస్‌ మళ్లి పుంజుకుంటుంది. కాని విదేశాల నుంచి వచ్చే వారి నుంచి కావడంతో చైనా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈశాన్య ప్రాంతంలోని హిలోంగ్జియాంగ్‌ ప్రావిన్స్‌లోకి రష్యానుంచి వచ్చిన వారిలో 79 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఉలిక్కిపడిన అధికారులు అక్రమంగా వస్తున్న వారిని అదుపులోకి తీసుకుని కరోనా పరీక్షలు చేస్తే దీనికి అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు. కాని సరిహద్దుల్లో ఎంత నిఘా ఉంచినప్పటికి చొరబాట్లు జరుగుతుండడంతో, అక్రమంగా వచ్చిన వారి ఆఛూకీ చెప్పిన,లేదా వారిని పట్టించిన 5,000 యువాన్‌లు(భారత దేశ కరెన్సి ప్రకారం 54,000) ఇస్తామని ప్రకటించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/