విశాఖలో నకిలీ నోట్లు స్వాధీనం

 

B N
B N

విశాఖ: రైల్వే స్టేషన్‌లో డిఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు బెంగుళూరు వాసుల నుంచి రూ.10.20లక్షల నకిలీ నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్‌కోచ్‌ ఎక్స్‌ప్రెస్‌లో హావ్‌డా నుంచి హైదరాబాద్‌కు నకిలీ నోట్లను తరలిస్తుండగా సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కర్ణాటక ఎన్నికల్లో నకిలీ నోట్లు పంపిణీ చేసేందుకు వెళ్తున్నట్లు నిందితులు స్పష్టం చేశారు. బెంగాల్‌ నుంచి నకిలీ నోట్లు తీసుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.