చిరుత సంచారంతో భ‌యం గుప్పిట్లో జనం!

TIGER
TIGER

పశ్చిమగోదావరి: జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం దగ్గర చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత దూడపై దాడి చేసిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో స్థానికులు బ‌యటకు పోవాలంటేనే భయపడుతున్నారు. చిరుత సంచారంపై స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. మ‌రోవైపు అధికారులు దీనిపై స్పందిస్తూ అది చిరుత కాదు… హైనా అని తెలిపారు.