మంత్రి పెద్దిరెడ్డిని అభినందించిన సిఎం జగన్‌

ఎన్నికల్లో విజయానికి కృషి చేశారంటూ పెద్దిరెడ్డిని ప్రశంసించిన సిఎం

అమరావతి: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మెరుగైన ఫలితాలు సాధించారంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సిఎం జగన్‌ అభినందించారు. అత్యధిక స్థానాల్లో వైఎస్‌ఆర్‌సిపి మద్దతుదారులు గెలిచేలా కృషి చేశారంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ కు మంత్రి పెద్దిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల హామీలు నెరవేర్చడం, సిఎం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే విజయానికి కారణాలు అని పెద్దిరెడ్డి వివరించారు.

మంత్రి పెద్దిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… ఏపీలో 13,095 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 10,524 పంచాయతీలు వైఎస్‌ఆర్‌సిపి మద్దతుదారుల కైవసం అయ్యాయి. టిడిపికి 2,063 పంచాయతీలు దక్కాయి. కాగా, పంచాయతీ ఎన్నికలు సాఫీగా జరిగుంటే 90 శాతం స్థానాలు వైఎస్‌ఆర్‌సిపి మద్దతుదారులే విజయం సాధించేవారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/