్‌మెర్సిడిస్‌ విక్రయాల్లో జోరు

Mercedes
Mercedes

మెర్సిడిస్‌ విక్రయాల్లో జోరు

ముంబయి: జర్మనీ లగ్జరీకార్ల తయారీ కంపెనీ మెర్సిడిస్‌ బెంజ్‌ తన కొత్త ఇక్లాస్‌ ఎల్‌డబ్ల్యుబి వాహనాలతో మార్కెట్లలో మంచి వాటాను సాధించింది. జిఎల్‌సి ఎస్‌యువి బెంజ్‌ పోర్టుఫోలియోలో జనవరి నుంచి మార్చివరకూ 3650యూనిట్లు విక్రయించినట్లు కంపెనీ ప్రక టించింది. ఇప్పటివరకూభారత్‌లో ఎన్నడూలేనం తగా భారీ విక్రయాలు చేపట్టింది. మొదటిత్రైమా సిక విక్రయాల్లో ఎక్కువగా ఇక్లాస్‌ లాంగ్‌వీల్‌బేస్‌ వెర్షన్‌, జిఎల్‌సి కేటగిరీలే ఎక్కువఉన్నాయి. కొత్త ఇక్లాస్‌ ఎల్‌డబ్ల్యుబి వెర్షన్‌ మంచి స్పందన వచ్చిం ది. మెర్సిడిస్‌బెంజ్‌ తన లగ్జరీ సెడాన్‌ ఉత్పత్తిని డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిచేసింది. ఎస్‌యువి కేటగిరీలో 13శాతంవృద్ధిని సాధించిన ట్లు కంపెనీ ప్రకటించింది. ఇక్లాస్‌ ఎల్‌డబ్ల్యుబి రెండుఇంజన్‌ ఆప్షన్లున్నాయి. 1991సిసి పెట్రోల్‌ మోటార్‌, 2987 సిసి వి6 డీజిల్‌యూనిట్‌లు ఉన్నాయి. 9జిట్రానిక్‌9స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌ మిషన్‌తో వస్తున్నాయి. పెట్రోలు ఇంజన్‌ 184 హెచ్‌పి శక్తితోపాటు 5500 ఆర్‌పిఎం, 300 ఎన్‌ఎం టార్క్‌ 1200 ఆర్‌పిఎంనుంచి 4000 ఆర్‌పిఎంవరకూ గరిష్టంగా ఇంధన శక్తినిస్తుంది. మెర్సిడిస్‌బెంజ్‌ ఇక్లాస్‌ ఎల్‌డబ్ల్యుబి వెనుక కేబిన్‌ స్పేస్‌ విశాలంగా ఉంటుంది. ఇంటరీయిర్‌ ఫీచర్లు 12.3 ఇంచ్‌ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థ ఆండ్రాయిడ్‌ ఆటో యాప్‌తోపాటు యాపిల్‌కార్‌ప్లేతో కూడా వస్తోంది. టచ్‌స్క్రీన్‌ యూనిట్‌లేకపోయినా సర్క్యులర్‌ టచ్‌పాడ్‌తో కార్యకలాపాలు కొనసా గించవచ్చని మెర్సిడిస్‌ బెంజ్‌ వెల్లడించింది.

======