్‌దూరవిద్యలో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌

career22
career

దూరవిద్యలో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌

దేశంలోనే పేరొందిన విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఒకటి. పార్లమెంటు ఆమోదంతో 1974లో సెంట్రల్‌ యూనివర్సిటీగా ఏర్పాటైంది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో సుమారు 2,300 ఎకరాల విస్తీర్ణం లో క్యాంపస్‌ ఉంది. అత్యున్నత అర్హతలకు తోడు ప్రతిష్ఠాత్మక అవార్డులు. గౌరవ పురస్కారాలు పొందిన ఫ్యాకల్టీ ఈ యూనివర్సిటీ సొంతం. హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీ అందించే రెగ్యులర్‌ కోర్సులకు ఎంత పేరుందో, దూరవిద్య కోర్సులకూ అంతే పేరు ఉంది. సమాజంలోని అన్ని వర్గాలకు విద్యా సేవలను అందించాలనే లక్ష్యంతో సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ వర్చ్యువల్‌ లెర్నింగ్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ సెంటర్‌ 13 కోర్సులను అందిస్తోంది. కరస్పాండెన్స్‌ కమ్‌ కాంటాక్ట్‌ తర గతులతో వీటిని నిర్వహిస్తోంది ఇవన్నీ ఏడాది కాలవ్యవధి కలిగిన కోర్సులు. ఆఫర్‌ చేస్తున్న పిజి డిప్లొమా కోర్సులు 1.ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ 2.కెమికల్‌ అనాల్సిస్‌ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ 3.సైబర్‌ లా అండ్‌ ఇంలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ 4.బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ 5.క్రిమినల్‌ జస్టిస్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ 6.గవర్నెన్స్‌ 7.హ్యూమన్‌ రైట్స్‌ 8.టెలీ కమ్యూనికేషన్స్‌ 9.కమ్యూనికేటివ్‌ ఇంగ్లీష్‌ 10.ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌ (హిందీ) 11.మెడికల్‌ బోటనీ, 12.లైబ్రరీ ఆటోమేషన్‌ అండ్‌ నెట్‌ వర్కింగ్‌ 13.ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ మెరిట్‌, అకడమిక రికార్డ్‌, ప్రొఫెషనల్‌ ఎక్స్‌పీరియెన్స్‌, ప్రత్యేకించి ఆయా రంగాల్లో అందించిన సేవల ఆధారంగా ఈ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తారు. నిబంధనలకు లోబడి రిజర్వేషన్లను కూడా పాటిస్తారు. పిజి డిప్లొమా ఇన్‌ లైబ్రరీ ఆటోమేషన్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ కోర్సును ప్రత్యేకించి లైబ్రరీ సైన్స్‌ గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలను పెంచే విధంగా తీర్చిదిద్దారు. అలాగే లైబ్రరీ రంగంలో ఉన్న ప్రొఫెషనల్స్‌కు సామర్థ్యాన్ని పెంచేలా ఉంటుంది.

సైబర్‌ లాస్‌ అండ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ ఇ-కామర్స్‌, ఇంటర్పెట్‌ బ్యాంకింగ్‌, ఇ-గవర్నెన్స్‌ విస్తృతికి కొన్ని చట్టాలు తప్పనిసరి. క్రిమినల్‌ జస్టిస్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ మరో ముఖ్యమైన కోర్సు ఇటు క్రిమినల్‌ జస్టిస్‌, అటు ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంపై అవగాహన కోసం ఈ కోర్సును తీర్చిదిద్దారు. యూనివర్సిటీకి చెందిన పొలిఇకల్‌ సైన్స్‌ విభాగం ప్రత్యేకంగా రూపొందించిన డిప్లొమా కోర్సు హ్యూమన్‌ రైట్స్‌, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ సహకారం కూడా ఈ కోర్సుకు ఉంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సులు చేసేందుకు అర్హులు. అయితే కెమికల్‌ అనాలసిస్‌ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌కు కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ చేసి ఉండాలి.
టెలీకమ్యూనికేషన్‌ కోర్సుకు మేథ్స్‌కు తోడు ఫిజిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌తో డిగ్రీ పాసై ఉండాలి. హిందీలో ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌కు డిగ్రీలో హిందీ ఒక సబ్జెక్టుగా ఉండాలి. లైబ్రరీ ఆటోమేషన్‌ కోర్సుకు లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ చేసి ఉండాలి. అర్హత, ఆసక్లి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకొని, పూర్తిచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు 2017 ఫిబ్రవరి 28లోపు పంపాలి. దరఖాస్తు ఫీజు రూ.300

2,313 పోస్టులతో ఎస్‌బిఐ పిఓ నోటిఫికేషన్‌ పోస్టులు :

2,313 (దీనిలో బ్యాక్‌లాగ్‌ పోస్టులు 313 కలిపారు) 1.ప్రిలిమ్స్‌ (100 మార్కులు), మెయిన్స్‌ (200 మార్కులు), రెండూ ఆబ్జెక్టివ్‌ తరహావే. రెండు పరీక్షలూ ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. 2.డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ (50 మార్కులు), (ఒక ఉత్తరం రాయడం+ఒక వ్యాసం రాయడం) 3.మెయిన్స్‌లో ఎక్కువ మార్కులు సాధించిన వారిని గ్రూప్‌ డిస్కషన్‌, ఫైనల్‌ ఇంటర్వ్యూకి పిలుస్తారు. సాధారణంగా రెండూ ఒకేరోజు ఉంటాయి. గ్రూప్‌ డిస్కషన్‌కి 20 మార్కులు, ఇంటర్వ్యూకి 30 మార్కులు కేటాయించారు. 4.ఏదైనా డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేయ వచ్చు. ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్‌ చదువు తున్నవారు కూడా అర్హులే. 5.జనరల్‌ కేటగిరికి చెందిన అభ్యర్థి కనీస వయస్సు 21 సంవత్సరాలు నిండరాదు కొన్ని వెనుకబడిన సామాజి వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. 6.జనరల్‌ అభ్యర్థులకు నాలుగుసార్లు మాత్రమే పరీక్ష రాసే అవకాశం ఉంది. 7.ప్రస్తుతం బేసిక్‌ వేతనం రూ.27,620 జిఎం గ్రేడ్‌ స్కేల్‌-1లో (దీనిపై అదనంగా డిఎ, సిసిఎ, ఇతర అలవెన్సులు ఉంటాయి) (ఆఫీసర్‌కు ఒక సంవత్సరంలో అన్నీ కలుపు కొని కనీసం రూ.7.93 లక్షల నుంచి అత్యధి కంగా రూ.12.95 వరకు రావచ్చు) 8.ప్రశ్నపత్రాలు ఇంగ్లీష్‌ హిందీలో భాషల్లో ఉం టాయి. (టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ ఎలాగూ ఇంగ్లీష్‌ లోనే ఉంటుంది) 9.ప్రతి తప్పు సమాధానికి 1/4 మార్కులు (నెగెటివ్‌ మార్కులు) తగ్గిస్తాయి.