హోలీ సెల‌వు 1న‌.. .ఐచ్చిక సెల‌వు 2న‌..

holi
holi

హైద‌రాబాద్ః హోలీ పండుగ సందర్భంగా మార్చి 2(శుక్రవారం)న ఐచ్ఛిక సెలవుగా ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌కే జోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవుల కేలెండర్‌లో మార్చి 1న సాధారణ సెలవుగా గుర్తించారు. కేంద్రం మార్చి 2న హోలీ సెలవు ఇచ్చింది. దీంతో దేవాదాయశాఖను సంప్రదించిన రాష్ట్రప్రభుత్వం హోలీ సెలవును యథాతథంగా ఉంచుతూనే మార్చి 2ను ఐచ్ఛిక సెలవుగా గుర్తించింది.