హోదా సాధ‌న‌కై సైకిల్ యాత్ర‌

TDP
TDP

విజయవాడ: హోదా సాధ‌న‌ కోసం టీడీపీ చేస్తున్న పోరాటంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజక వర్గంలో సైకిల్ యాత్రను ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని మాట్లాడుతూ 2014లో ఏపీకి రావాల్సిన 18 హామీలు, హోదాతోపాటు మొత్తం 19 హామీలు అమలయ్యేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మొన్న ధర్మపోరాట దీక్ష, నిన్నటి నుంచి సైకిల్ యాత్రలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. అదే విధంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ సైకిల్ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, ఎంపీ గల్లా జయదేవ్, టీడీపీ నేత కోడెల శివరాం తదితరులు పాల్గొన్నారు. కర్నూలుజిల్లా, ఆళ్లగడ్డ మండలం క్రిష్ణాపురంలో మంత్రి భూమా అఖిలప్రియ సైకిల్ యాత్ర నిర్వహించారు.