హోదా ఇస్తే.. బిజెపితో దోస్తీ

JAGAN
JAGAN

హోదా ఇస్తే.. బిజెపితో దోస్తీ

వైఎస్సార్సీ అధినేత జగన్‌ సంచలన ప్రకటన
రాష్ట్రంలో మా టార్గెట్‌ తెలుగుదేశం పార్టీయే
కాంగ్రెస్‌, బిజెపిలకు రాష్ట్రంలో స్థానం లేదు

హైదరాబాద్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే వచ్చే సాధా రణ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్దమని వైఎస్సార్సీ పఅధ్యక్షుడు జగన్‌ స్పష్టం చేశారు. ఏపిలో తమ పార్టీ టార్గెట్‌ తెలుగుదేశం పార్టీయే నన్నారు. గత ఎన్నికల్లో అన్ని అవాస్తవాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఇది ప్రజలు గ్రహిస్తున్నారని పేర్కొన్నారు. ఒక జాతీయ టివి ఛానల్‌ సోమవారం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏపిలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌లు, బిజెపిలకు తావులేదని వివరించారు. గత ఎన్ని కల్లో 1.5శాతం ఓట్ల తేడాతో తాను ప్రతిపక్షంలో ఉండిపోవాల్సి వచ్చిందని, రైతులకు రుణమాఫి, స్వయంసహాయక బృందాలకు మహిళలకు, ఇతర వర్గాలకు తప్పుడు వాగ్దానా లతో ప్రలోభపెట్టి బాబు అధికారం లోకి వచ్చారని దూయబట్టారు.