హోదా ఇస్తేనే చర్చలు

TDP MPs
TDP MPs

హోదా ఇస్తేనే చర్చలు

జైట్లీ పిలుపును తిరస్కరించిన టిడిపి ఎంపిలు

అమరావతి: ఏపికి ప్రత్యేకహోదాపై జాతీయ స్థాయిలో చర్చ మొదలు కావడం,టిడిపి,వైఎస్సార్సీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఉభయసభల్లో నిరసనలు రోజు కోక మలుపు తిరుగుతుండడం,తీర్మానం ప్రవేశపెట్టి బిజేపి స్వపక్ష ఎంపీలే రహస్య ఓటింగ్‌లో బిజేపి ప్రభుత్వాన్ని కూలదోయడానికి అధిష్టానానికి సంకేతలు వెళ్ని నేపధ్యంలో కేంద్రం మరో మారు దిగివచ్చి టిడిపి ఎంపీలను శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ చర్చలకు ఆహ్వానించారు.

దీంతో కేంద్ర మాజీమంత్రి,టిడిపి ఎంపీ వై.సుజనా చౌదరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డుకు సమాచారం ఇవ్వడంతో ఆయన తమ ప్రభు త్వం చేస్తున్న కుట్రలన్నీ ఫలించకపోవడం టిడిపిపై వైఎస్సార్సీ, జనసేనలతోపాటు రాష్ట్ర బిజెపి నేత లను టిడిపిపై తారాస్థాయిలో ఆరోపణలకు పురికొ ల్పడం వాటిని టిడిపి అధిష్టానం ధీటుగా ఎదుర్కొ వడంపై కేంద్రం ఇక టిడిపితో రాజీధోరణికి దిగివ చ్చినట్లు తెలిసింది.తాము కేంద్రంనుంచి,ఎన్డీఎ నుంచి తెగదెంపులు చేసుకున్నాక చర్చలు ఏమిటి ప్రత్యేకహోదా ప్రకటించి,విభజన చట్టం హామీల అమలు చేసిన తర్వాత కేంద్రంతో చర్చిస్తామని బాబు తమ ఎంపీలకు సూచించినట్లు తెలిసింది.

దీంతో టిడిపి ఎంపీలు అరుణ్‌జైట్లీ పిలుపును సున్నితంగా తిరస్కరించి లోక్‌సభలోనే తేల్చుకుం దామని పేర్కొనట్లు తెలిసింది. పాపం బిజేపి దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేస్తామని ఊహించుకొని టిడిపిని రెచ్చకొట్టడంతో సీన్‌ రివర్స్‌అయిన్నట్లు తెలిసింది.టిడిపి అధిష్టానం జాతీయస్థాయిలో విప క్షాలమద్దతు కూడకట్టడం ఏకంగా 11రాష్ట్రా పార్టీ లను దాదాపు 150మంది ఎంపిల మద్దతుతో టిడి పి సిద్ధం చేసుకోవడంతో బిజెపి అధిష్టానం గుం డెల్లో రైళ్లు పరిగేత్తుతున్నాయి

ప్రస్తుతానికి విపక్షాల మద్దతుతో కేంద్రప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గలేమని గుర్తించి టిడిపి అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు, బాబుతో మంచి సంబంధాలు కలిగి, ఏపి అభివృద్ధికి ఆశించిన రీతిలో సహక రించిన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడును రంగంలోకి దింపగా ఆయన మాటను కేంద్రం ధిక్కరించడంతో జాతీయస్థాయిలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో కేంద్రప్రభుత్వం కుప్పకూ లుతోందని గ్రహించి వెంకయ్యను రంగంలోకి దిం పగా ఆయన జరగాల్సిదంతా జరిగిపోయిందని చే తులేత్తేసినట్లు తెలిసింది.