హోదాకై ఎంపీలంతా కేంద్రంపై ఒత్తిడి తేవాలిః వ‌ర‌ప్ర‌సాద్‌

vara prasad rao
vara prasad rao

న్యూఢిల్లీః ప్రత్యేక హోదా బీజేపీ సొమ్ముకాదని..ఇచ్చి తీరాల్సిందే అని వైసీపీ ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తే ఎవరితోనైనా కలిసి ఉంటామని ప్రకటించారు. శుక్రవారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఎంపీలందరూ ఒత్తిడి తేవాలన్నారు. 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పిందనడం హాస్యాస్పదమని ఎంపీ వరప్రసాద్ మండిపడ్డారు.