హోటల్‌ అగ్నిప్రమాదంలో 17కు చేరిన మృతులు

Karol Bagh hotel fire doused, 9
Karol Bagh hotel fire doused, 9

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈరోజు తెల్లవారుజామున కరోబ్‌ బాగ్‌ ప్రాంతంలోని హోటల్‌ అర్పిట్‌ ప్యాలస్‌లో అగ్నిప్రమాదం జరిన విషయం తెలిసిందే. అయితే మృతుల సంఖ్య 17 కు చేరింది. తొమ్మిది మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో సుమారు 60 మంది వరకూ ఉండగా, 30కి పైగా అగ్నిమాపక శకటాలు ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశాయి. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగినట్టు తెలిస్తోంది. ప్రమాద కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.