హోం సైన్స్‌ విద్యార్థినులకు స్పెషల్‌

career55
career

హోం సైన్స్‌ విద్యార్థినులకు స్పెషల్‌

కేవలం విద్యార్థినులకు ఉద్దేశించిన బిఎస్సీ (ఆనర్స్‌) హోంసైన్స్‌ కోర్సు కాలపరిమితి నాలుగు సంవత్సరాలు హైదారాబాద్‌లోని సైఫాబాద్‌లో గల హోంసైన్స్‌ కళాశాలలో 1964 నుంచి హోం సైన్స్‌ కోర్సు ఉంది.గ్రామీణ జీవన విధానానికి అనుగుణంగా విద్యార్థి నులను తీర్చిదిద్దడమే కాదు వారికి జీవనోపాధిని సైతం కల్పిస్తు న్నారు. ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు. కోర్సులో భాగంగా ఫుడ్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌, ఫ్యామిలీ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ హోంసైన్స్‌ ఎక్స్‌టెన్షన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ మేనేజ్‌మెంట్‌, హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫ్యామిలీ స్టడీస్‌, టెక్స్‌టైల్స్‌ అండఠ్‌ అపెరల్‌ డిజైనింగ్‌ కోర్సులను చదవాల్సి ఉం టుంది.

మొదటి రెండేళ్ళూ ఐదు సబ్జెక్టులను అందరూ తప్పకుండా చదవాలి. ఆ తరవాత మాత్రం వారు ఎంచుకున్న కోర్సుల్లో స్పెషలై జేషన్‌ ఉంటుంది. దాని ప్రకారం విద్యా బోధన ఆ ఒక్క కోర్సులోనే ఉంటుంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫుడ్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌: స్పెషలైజేషన్‌ కింద న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌ కోర్సు లు చదవ వచ్చు. ఇందులో బయో కెమెస్ట్రీ, ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌ మెంట్‌, క్లినికల్‌ న్యూట్రిషన్‌, బేకరి అండ్‌ కన్‌ఫెక్షనరీ, న్యూట్రిషన్‌ ఫర్‌ స్పెషల్‌ కోర్సు, కేటరింగ్‌ మేనేజ్‌ మెంట్‌, ఫుడ్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌, కన్వీని యన్స్‌ అండ్‌ హెల్త్‌ పుడ్స్‌, పుడ్‌ టాక్సి కాలజీ, హెల్త్‌, హైజిన్‌ అండ్‌ శానిటేషన్‌, డై కౌన్సి లింగ్‌, హాస్పిటల్‌ డైటెటిక్స్‌లను చదవాల్సి ఉంటుంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్యామిలీ అసోర్స్‌ మేనేజ్‌మెంట్‌: ఈ స్పెషలైజేషన్‌ ఫ్యామిలీ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు ఉంటుంది.

ఇందులో డ్రాయింగ్‌ ఇన్‌ ఇంటీరియర్స్‌, బేసిక్స్‌ అండ్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ తదితర కోర్సులుంటాయి. హోంసైన్స్‌ ఎక్స్‌టెన్షన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ మేనేజ్‌మెంట్‌: ఈ కోర్సు చేయదలిచినవారు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కమ్యూనికేషన్‌ మేనేజ్‌మెంట్‌ను స్పెషలైజేషన్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది. మాస్‌ కమ్యూనికేషన్‌, ఎల క్ట్రానిక్‌ జర్నలిజం, ఫొటో జర్నలిజం, ప్రింట్‌ జర్నలి జం తదితర కోర్సులుంటాయి. ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫ్యామిలీ స్టడీస్‌ : ఈ కోర్సులో ఏయదలిచినవారు స్పెషలైజేషన్‌గా ఆర్గనైజే షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఈసిసిడి ప్రోగ్రామ్స్‌ చేయాల్సి ఉం టుంది. ఇందులో ఇన్‌ఫాంట్‌ స్టిమిలైజేషన్‌ ప్రోగ్రామ్స్‌, డెవలప్‌ మెంట్‌ ఫర్‌ చిల్డ్రన్‌ తదితర కోర్సులుంటాయి. టైక్స్‌టైల్‌ అండ్‌ అపెరల్‌ డిజైనింగ్‌: టైక్స్‌టైల్‌ అండ్‌ అపెరల్‌ డిజై నింగ్‌ కోర్సు చేయదలచిన వారు స్పెలైజేషన్‌గా అపెరల్‌ ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్‌ ఒకేషన్‌ ఎఫెక్టివ్‌ కోర్సులు చేయాల్సి ఉంటుంది. ఇందులో ట్రెడిషనల్‌ ఇండియన్‌ టైక్స్‌టైల్‌, కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజూనింగ్‌ తదిత కోర్సులుంటాయి.

ఆపై ఏయే కోర్సులు :

బిఎస్సీ (ఆనర్స్‌) హోంసైన్స్‌ తరువాత వారు ఎంచుకున్న స్పెషలైజేషన్‌ ప్రకారం ఎమ్మెస్సీ న్యూట్రియన్‌ అండ్‌ డైటెటిక్స్‌ చదవవచ్చు. ఆపై ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌లో పిహెచ్‌డి చేయవచ్చు. ఎమ్మెస్సీ చైల్డ్‌ గైడెన్స్‌ అండ్‌ ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ కూడా చదవచ్చు. ఉమెన్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫ్యామిలీ స్టడీస్‌లో పిహెచ్‌డి చేయవచ్చు. ఎమ్మెస్సీలో హోంసైన్స్‌ ఎక్స్‌టెన్షన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ మేనేజ్‌మెంట్‌, ఎమ్మెస్సీలో అపెరల్‌ టెక్స్‌టైల్స్‌ చదవవచ్చు. ఉద్యోగావకాశాలు: బిఎస్సీ (ఆనర్స్‌) పూర్తిచేసినవారికి పరిశ్రమల్లో డైటీషియన్లు, న్యూట్రిషన్‌ కన్సెల్టెంట్స్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అసోసి యేట్స్‌ చైల్డ్‌ కేర్‌ ప్రొఫెషనల్స్‌ డెవలప్‌మెంటల్‌ స్పెషలి స్టులు, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధికారులు, జర్నలిస్టులు, రిపోర్టర్లు, ఎడిటర్స్‌ అపెరల్‌ ఇండస్ట్రీస్‌లో డిజైనర్స్‌, శాంపుల్‌ మేకింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌చార్జులు, క్యాడ్‌ ప్రొఫెషనర్స్‌గా ఉద్యోగావాశాలు ఉంటాయి. అలాగే సంబంధిత వ్యాపారవేత్తలుగానూ కొనసాగవచ్చు. ======