హోంగార్డుల వేతనాల పెంపునకు గ్రీన్‌సిగ్నిల్‌

 

AP MINISTER YENAMALA
AP MINISTER YENAMALA

హోంగార్డుల వేతనాల పెంపునకు గ్రీన్‌సిగ్నిల్‌

అమరావతి: రాష్ట్రంలో హోంగార్డుల వేతనాల పెంపుదలకు ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకారం తెలిపారు. భూగర్భ, అటవీశాఖల్లో బినామీ వ్యవస్ధకు అడ్డుకట్టవేయా లని ఆయన ఆదేశించారు. రాబోవు బడ్జెటలో ప్రతిపాదనలపై హోం, విద్యుత్‌,రెవెన్యూ, అటవీ, ఎక్సైజ్‌, దేవాదాయ, ధర్మాదాయ, కమ ర్షియల్‌ డిపార్టుమెంట్‌ అధికారులతో సచివాలయంలోని తన కార్యా లయంలో ఆయన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీసులతో సమానంగా విధుల నిర్వర్తిసున్న హోంగార్డుల జీతాల పెంచాలని డిజిపి ఎం మాలకొండయ్య, హోంశాఖ ముఖ్యకార్యదర్శి నురాధ, ఆర్ధిక మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి అంగీకారం తెలి పారు.

ఎంత మేర పెంచాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకోవాలని డిజిపి, హోంశాఖ ముఖ్యకార్యదర్శిని ఆర్ధికమంత్రి యనమల ఆదేశిం చారు. అమరావతిలో నిర్మించతలపెట్టిన పోరెనిక్స్‌ ల్యాబ్‌కు, జిల్లా స్ధాయిల్లో జైళ్ల భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. మిగిలిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. పెరిగిన డీజిల్‌ ధరల నేపధ్యంలో నిధులు కేటాయిం చాలని డిజిపికోరారు. విశాఖపట్నంలో పోలీస్‌స్టేషన్ల భవన నిర్మా ణాలు, ఇతర మౌలికసదుపాయాల కల్పనకు ప్రత్యేకబడ్జెట్‌ కేటాయిం చాలని ఆర్ధికమంత్రిని కోరారు. అక్టోపస్‌, గ్రేహౌండ్స్‌, ఇంటెలిజెంట్‌ విభాగాలకు రాబోయే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని సంబంధిత అధికారులు కోరారు. అగ్నిమాపక కేంద్రాల్లో సాంకేతిక పరిజ్ఞానం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వాహనాల కొనుగోలుకు నిధులకు ఆ శాఖ అధికారులు, ఆర్ధిక మంత్రిని కోరారు. అగ్ని మాపక కేంద్రాల్లో ఖాళీల భర్తీకి అనుమతివ్వాలని మంత్రి కోరారు.

==