హైద‌రాబాద్ విశ్వ‌న‌గ‌రంగా నిలిపేందుకు బ‌ల్దియా అడుగులు

bontu rammohan
bontu rammohan

హైదరాబాద్: హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలిపేందుకు బల్దియా ఒడి ఒడిగా అడుగులేస్తోంది. అందులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని విభాగాలను ఒకే గొడుగుకిందకు తీసుకువచ్చేందుకు బల్దియా కసరత్తు చేస్తోంది. బల్దియాలోని ఫైర్, ఇంజనీరింగ్, డిజాస్టర్, ఫుడ్, హెల్త్, వాటర్ ఇలా అన్ని శాఖల సమన్వయంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఐదు జోన్లకు ఆరు ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ టీమ్స్ కమిషనర్ కంట్రోల్‌లో పనిచేస్తుందని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. జీహెచ్‌ఎంసీలోని అన్ని శాఖల్లో పారదర్శకత, ప్రజలకు మెరుగైన సేవలు, వారి సమస్యల పరిష్కారం కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ పనిచేస్తోంది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నవారితోపాటు పోలీస్, ఇతర శాఖల నుంచి 300 మంది సిబ్బందిని నియయిస్తున్నారు. భవిష్యత్తులో మరో వెయ్యిమందితో శాఖను బలోపేతం చేసి సేవలను విస్తరించనున్నారు.