హైద‌రాబాద్‌లో ప‌రిపూర్ణానందస్వామి ర్యాలీ..

Paripurnanda swamy
Paripurnanda swamy

నగర బహిష్కరణ తర్వాత హైదరాబాద్ నగరానికి వచ్చిన శ్రీ‌పీఠం అధిప‌తి పరిపూర్ణానంద స్వామికి ఘన స్వాగతం లభిస్తుంది. సూర్యాపేట నుండే హిందూ సంస్థలు, బీజేపీ కార్యకర్తలు స్వామికి హారతులతో స్వాగతం పలికారు. ఇక నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే పరిపూర్ణానందర్యాలీ కారణంగా నగరంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ధర్మజ్వాల పేరుతో ద్విచక్రవాహానాలు, కార్లుతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. బీజేపీ, విహెచ్ పి, హిందూధార్మిక సంస్థలు ర్యాలీలో పాల్గొనగా మరింత గట్టిగా నినాదాలు చేయాలని పరిపూర్ణానంద కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. విజయవాడ నుండి హైదరాబాద్ జాతీయరహదారి పై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబర్ పెట్, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాలలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఉద్యోగులు ఇళ్లకు చేరే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుండగా ర్యాలీలో అంబులెన్సులు చిక్కుకున్నాయి.