హైదరాబాద్‌ బుల్స్‌పై కరీంనగర్‌ కింగ్స్‌విజయం

KABADDI
KABADDI

-తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ
హైదరాబాద్‌: తెలంగాణ ప్రీమియర్‌ కబడ్డీ సీజన్‌-2లో 12వరోజైన బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ బుల్స్‌పై 19-35 స్కోరుతో కరీంనగర్‌ కింగ్స్‌విజయం సాధించింది. తొలిఅర్థభాగం నుండే ముందంజలో ఉండి కరీంనగర్‌ జట్టు విజయం సొంతం చేసుకుంది. బెస్ట్‌ రైడర్‌అవార్డు మునీష్‌ (కరీంనగర్‌ కింగ్స్‌) సొంతం చేసుకోగా,బెస్ట్‌ డిఫెండర్‌ అవార్డ్‌ బి.నిఖిల్‌ (కరీంనగర్‌ కింగ్స్‌) సొంతం చేసుకున్నాడు. కాగా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లో 22పాయింట్లతో వరంగల్‌ వారియర్స్‌ మొదటిస్థానంలో ఉండగా రంగారెడ్డి తర్వాతిస్థానంలో ఉంది. 20పాయింట్లతో కరీంనగర్‌ కింగ్స్‌,18పాయింట్లతో గద్వాల్‌ గాల్డియేటర్స్‌ఆత్వాతి స్థానంలో ఉంది. .12పాయింట్లతో నల్గొండ ఈగల్స్‌జట్టు చివరి స్థానంలో ఉంది.