హైదరాబాద్‌లో రెండ్రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic restrictions
Traffic restrictions

హైదరాబాద్‌: నగరంలో ఈ రోజు రాత్రి సుమారు గంటపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. నేడు నగరానికి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు రానున్న నేపథ్యంలో రాత్రి 8.20-9.10గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నట్లు నగర పోలీస్‌ కమీషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. బేగంపేట్‌ విమానాశ్రయం, పిఎన్‌టి జంక్షన్‌, శ్యాంలాల్‌ బిల్డింగ్‌, పంజాగుట్ట ఫ్లైఓవర్‌, ఎన్‌ఎఫ్‌ సీఎల్‌ గ్రేప్‌ యార్డ్‌, శ్రీనగర్‌ కాలనీ టీ జంక్షన్‌, సాగర్‌ సొసైటీ జంక్షన్‌, ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌, కెబిఆర్‌ పార్కు, క్యాన్సర్‌ ఆస్పత్రి, టిఆర్‌ఎస్‌ భవన్‌ రోడ్డు, ఒరిస్సా ఐ ల్యాండ్‌, బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 ఉపరాష్ట్రపతి నివాస ప్రాంతాల్లో ఆంక్షలు వర్తిస్తాయి. కాగా, గవర్నర్‌ నరసింహన్‌ రేపు రాజ్‌భవన్‌లో ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 6-8గంటల వరకు రాజ్‌భవన్‌ మార్గంలో వాహనాలు రాకపోకలను నిషేధించనున్నట్లు పోలీసులు తెలిపారు.