హైదరాబాద్‌లో అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్‌

Arrested
Arrested

హైదరాబాద్‌: గంజాయి అంతరాష్ట్ర రవాణా ముఠాలో ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయి సరఫరా చేస్తున్న ముఠాలో ఇద్దరు సభ్యులు రావు రోహిత్‌, ప్రేమ్‌ కుమార్‌ను ఎల్బీ నగర్‌ జోన్‌ ఎస్‌ఒటి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి 30 కిలోల గంజాయి, ఒక కారు, రూ.12వేలు నగదు, రెండు మోబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను హయత్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. కాగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.