హైదరాబాద్‌పై పుణే 6 వికెట్ల తేడాతో విజయం

Dhoni pune Wins
Dhoni pune Wins

హైదరాబాద్‌పై పుణే 6 వికెట్ల తేడాతో విజయం

పుణే: పుణేలోని మహారాస్ట్రక్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ 6 వికెట లతేడాతో ఉత్కంఠ భరిత విజయం సాధించింది.. ధోనీ (61) క్రీజ్‌లో చెలరేగి అజేయంగా నిలిచాడు.. చివరి బంతికి బౌండ్రీకొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు..సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని పుణే 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది.