హైదరబాద్‌లో పార్కుల్లో ప్రవేశ రుసుము పెంపు

Park
Park

హైదరాబాద్‌: నగరంలో జిహెచ్‌ఎంసి పరిధిలో గల ప్రధాన పార్కుల్లో ప్రవేశ రుసుము పెరుగనుంది. ప్రస్తుతం రూ.5/- ఉన్న రుసుమును రూ.10/-కి పెంచాలని నిన్న జరిగిన జిహెచ్‌ఎంసి స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం పెద్దలకు రూ.5/-గా ఉన్న ప్రవేశ రుసుమును రూ.10/-, పిల్లలకి రూ.3/-గా ఉన్న రుసుము రూ.5/-కు పెంచనుంది. ఈ రుసుములు జనవరి 1,2018 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉందని జిహెచ్‌ఎంసి కమీషనర్‌ బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు. ప్రవేశ రుసుము పెరుగనున్న పార్కులు- ఇందిరా పార్కు, సుందరయ్యపార్కు, కృష్ణకాంత్‌ పార్కు, జలగం వెంగళరావుపార్కు, కేఎల్‌ఎన్‌ యాదవ్‌ పార్కు, చాచా నెహ్రూ పార్కు, ఇమ్లిబన్‌ పార్కు.