హైకోర్టును ఆశ్రయించిన స్టెరిలైట్‌

STERILITE
STERILITE

చెన్నె: వివాదస్పద రాగి ఫ్యాక్టరీ స్టెరిలైట్‌ యాజమాన్య సంస్థల వేదాంత గ్రూప్‌ నేడు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఫ్యాక్టరీని నిర్వహించేందుకు అవసరమైన కనీస సిబ్బందితో పాటు తగినంత విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నెల 18 నుంచి ఆరంభమైన ప్లాంటులో సల్ఫ్యూరిక్‌ ఆమ్లం లీకేజీని సరిదిద్దగల అధికారిక సిబ్బందితో పాటు కనీస విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని అభ్యర్థించింది. కాగా తూత్తుకూడిలో ప్రజాభద్రతకు ఆటంకం కలగకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు తూత్తుకూడి కలెక్టర్‌ సందీప్‌ నండూరి పేర్కొన్నారు. విష కాలుష్యాలను వెదజల్లుతున్న స్టెరిలైట్‌ ఫ్యాక్టరీని మూసేయాలంటూ గత నెలలో స్థానికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విసయం విదితమే. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో 13మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100మందికిపైగా క్షతగాత్రులయ్యారు.