హెల్మెట్ ధరించిన తొలి అంపైర్
కాన్బెర్రా : బౌలర్ల ధాటికి మాత్రమే ఇప్పటి వరకు బ్యాట్స్మెన్లు హెల్మెట్ ధరించే వారు. కానీ బ్యాట్స్మెన్ల దూకుడుకు ఇప్పుడు అంపైర్లు కూడా హెల్మెట్ ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది .ఆస్ట్రేలియా,భారత్‌ల మధ్య జరుగుతున్న నాలుగవ వన్డే ఇందుకు వేదికైంది.కాగా మ్యాచ్ ఆరవ ఓవర్లో ఫించ్ కొట్టిన షాట్‌కు అంపైర్ రిచర్డ్స్ కాలికి గాయమైంది.దీంతో చికిత్స కోసం గ్రౌండ్‌ను వదిలి వెళ్లాల్సి వచ్చింది.దీంతో అప్పటి వరకు మామూలుగానే ఉన్న జాన్ వార్డ్ ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా హెల్మెట్ ధరించి అంపైరింగ్‌కు వచ్చాడు.ఇది వరకే భారత్ దేశావాలీ క్రికెట్ సందర్భంగా ఆంపైరింగ్ చేస్తున్న సమయంలో జాన్వార్డ్ తలకు బాల్ తగిలి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఒక అంపైర్ హెల్మట్ ధరించి మైదానంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఇటీవలి కాలంలో మైదానంలో బంతులు తగిలి క్రికెటర్లు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే.దీంతో ఆటగాళ్లే కాకుండా అంపైర్ల సేప్టీ కోసం ఆసీస్ క్రికెట్ బోర్డు ముందుకు వచ్చింది.దీనిలో భాగంగా అంపైర్కూ హెల్మెట్ ఉండాల్సిందేనంటూ వాదిస్తోంది.