హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య సినిమా ప్రారంభం!

POLICE VENKATESWARLU
Ramoji Rao Given Clap fro For Opening Shot

హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య సినిమా ప్రారంభం!

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్‌ తెరకెక్కిస్తున్న చిత్రం హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య. ఆర్‌.నారాయణమూర్తి, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదలవాడ పద్మావతి నిర్మాత. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో బుధవారం ఉదయం జరిగింది. మీడియా మొఘల్‌ రామోజీరావు ఈ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. ఫిల్మ్‌ సిటీ ఎండీ రామ్మోహన్‌రావు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఎస్వీ కష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ.. చదలవాడ శ్రీనివాసరావుతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. నేను ఇందులో హెడ్‌కానిస్టేబుల్‌గా నటిస్తున్నాను. కథ వినగానే ఈ వేషం వేయాలనిపించింది. చేస్తున్నాను. నాకు సావిత్రిగారంటే ఇష్టం. ఆ తర్వాత జయసుధగారి నటనంటే ఇష్టం. జయసుధగారితో చేయడం ఆనందంగా ఉంది అని అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బ్లాక్‌ మనీ వల్ల ఎంత నష్టం జరుగుతోంది.. మరీ ముఖ్యంగా మధ్య తరగతి వాళ్లు ఎలా దాని వల్ల నష్టపోతున్నారు వంటి అంశాల గురించి ఆలోచించాను. డబ్బు ఒకచోట ఆగిపోవడం వల్ల ఉద్యొగం ఉండదు. ఫ్లోటింగ్‌ ఉండదు. అందుకే ప్రబుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. ట్రాన్సాక్షన్స్‌ అన్నీ బ్యాంకుల ద్వారా జరగాలి అనే కాన్సెప్ట్‌ తో అల్లుకున్నాం. నారాయణమూర్తి గారికి కథ నచ్చి చేయడానికి ఒప్పుకున్నారు. జయసుధగారు ఫోన్‌లో విని చేస్తానన్నారు. ఈ రోజు నుంచి ఈ సినిమా మొదలైంది. కంటిన్యూయస్‌గా ఒకే షెడ్యూల్లో తీస్తాం. జనవరిలో విడుదల చేస్తాం. వందేమాతరం సంగీతంలో ఇప్పటికే పాటలను రికార్డ్‌ చేశాం. ఏసుదాస్‌గారు, బాలుగారు, కీరవాణిగారు పాటలను పాడారు. చాలా బాగా వచ్చాయి అని చెప్పారు.జయసుధ మాట్లాడుతూ.. ఈ చిత్రం నాకు చాలా స్పెషల్‌. నేను హీరోయిన్‌గా చేసేటప్పుడు కొన్ని కథలు, కాంబినేషన్లు వినగానే కొత్తగా అనిపించేది. ఈ సినిమా నాకు అలాగే అనిపిస్తోంది. నారాయణమూర్తి గారు ఎప్పటి నుంచో తెలుసు. అయితే ఆయన పక్కన చేయడం ఇదే తొలిసారి. యాక్టర్‌గా ఆయనంటే నాకు ఇష్టం. కెమెరా ముందు మేమిద్దరం పోటాపోటీగా నటించాలనుకుంటున్నాం అని అన్నారు.