హెచ్‌-1బీ ఉద్యోగులు ఒక‌టి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసుకోవ‌చ్చు!

h1b
h1b

వాషింగ్టన్‌: విదేశీ ఉద్యోగుల‌కు అమెరికా శుభ‌వార్త అందించింది. హెచ్‌-1బీ వీసా కలిగిన విదేశీ ఉద్యోగులు అమెరికాలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకోవ‌చ్చ‌ని ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీ వెల్లడించింది. అమెరికాలోని కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలంటే ఆ ఉద్యోగులకు హెచ్‌-1బీ వీసా ఉండాలి. ఏటా భారత్‌, చైనా లాంటి దేశాల నుంచి వేల సంఖ్యలో టెక్‌ నిపుణులు ఈ వీసాపై అమెరికాలో ఉద్యోగం పొందుతున్నారు. అయితే ఈ వీసా ఉన్నవారు సాధారణంగా తమ దేశంలో ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో విధులు నిర్వహించొచ్చని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) తెలిపింది. ‘హెచ్‌-1బీ ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేసుకోవచ్చు. కానీ ప్రతి కంపెనీ కోసం ఐ-129 ధ్రువీకరణ తప్పనిసరి’ అని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. కొత్త ఉద్యోగులు ఈ ఐ-129 పిటిషన్‌ తప్పనిసరిగా సమర్పించాలని సూచించింది. ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసని పేర్కొంది.