హెచ్-1బి వీసా దారులు దోపిడికి గురవుతున్నారు

వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1 బి వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులకు పని చేసే చోట వాతావరణం ఏమీ బాగోవట్లేదని, వేధింపులకు గురవుతున్నారని, పనికి తగిన వేతనం ఇవ్వకుండా దోపిడి చేస్తున్నారని అమెరికాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. ఈ ఉద్యోగాల విషయంలో జీతాల పెంపుతో పాటు పలు సంస్కరణలు తేవాలని సౌత్ ఏషియన్ సెంటర్ ఆఫ్ ది అట్లాంటిక్ కౌన్సిల్ (థింక్-ట్యాంక్) అనే సంస్థ సూచించింది. ఈ వీసాలపై పనిచేసే వారికి మంచి పని వాతావరణం, ఉద్యోగ హక్కులు కల్పించాలని పేర్కొంది. హెచ్-1బి వీసా విధానంలో మార్పులు తెస్తామని, మంచి సంస్కరణలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఈ సంస్థ ఉద్యోగ పరిస్థితులను చాలా మెరుగు పరచాలంటూ నివేదిక విడుదల చేసింది.