హెచ్‌సీయు ప్రవేశాల షెడ్యూల్‌ ఖరారు

U H
U H

హైదరాబాద్‌: కేంద్రీయ విశ్వవిద్యాలయ(సియు) ప్రవేశాల షెడ్యూల్‌ ఖరారైంది. ఈ ఏడాది 117 కోర్సుల్లో 1,945 సీట్లు భర్తీ చేస్తామని ఉపాధ్యక్షులు అప్పారావు తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి మే 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ ఉంటుందన్నారు. జూన్‌ 1నుంచి 5వరకు దేశవ్యాప్తంగా 38కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ ఏడాది 14కోర్సులు నిలిపి వేసి 6 కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. నా భద్రత వ్యవహారం ప్రభుత్వం, పోలీస్‌ శాఖ చూసుకుంటుందని ఉపాధ్యక్షులు అప్పారావు అన్నారు. విద్యార్థులు తలెత్తుకునేలా ఉండాలన్నది వర్సిటీ యాజమాన్యం ఆకాంక్ష అన్నారు. వర్సిటీ నిర్ణయాలను కొందరు విభేదించినా తర్వాత అర్థం చేసుకుంటామన్నారు.