హెచ్‌సిఎ సలహా కమిటీలో లక్ష్మణ్‌ ఎంపిక

s7
Lakshman

హెచ్‌సిఎ సలహా కమిటీలో లక్ష్మణ్‌ ఎంపిక

హైదరాబాద్‌: హైదారాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సిఎ)లో కొత్తగా క్రికెట్‌ సలహా కమిటీ ఏర్పాటైంది.ఏప్రిల్‌ 12న జరిగిన హెచ్‌సిఎ అపెక్స్‌ కౌన్సిల్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రికెట్‌ సలహా కమిటీలో టీమిండియా మాజీ క్రికెటర్లు లక్ష్మణ్‌,వెంకటపతి రాజు,పూర్ణిమారావులను సభ్యులుగా ఎంపిక చేసినట్లు హెచ్‌సిఎ ఒక ప్రకటనలో పేర్కొంది.సలహా కమిటీలో ఉండేందుకు లక్ష్మణ్‌,రాజు,పూర్ణిమ అంగీకరించి నట్లు హెచ్‌సిఎ పేర్కొంది.తాము అడిగిన వెంటనే అంగీకరించినందకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు హెచ్‌సిఎ కార్యదర్శి టి శేష్‌ నారాయణ్‌ తెలిపారు.హైదరాబాద్‌ క్రికెట్‌ అభివృద్ది కోసం ఎపెక్స్‌ కౌన్సిల్‌ సలహా కమిటీ మార్గనిర్ధేశనం చేస్తుంది.అంతే కాదు ఈ కమిటీ సభ్యులు అపెక్స్‌ కౌన్సిల్స్‌కు విలువైన సలహాలు,సూచనలు ఇవ్వనున్నారు.కమిటీలో భాగం పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది.హైదరాబాద్‌ క్రికెట్‌ భవిష్యత్‌ మరింత పటిష్టంగా ఉండేందుకు ఈ కమిటీ ఉపయోగపడుతుంది అని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు
.ఇక క్రికెట్‌ వ్యవహారాల కోసం ఇటీవల ఏర్పడిన అపెక్స్‌ కౌన్సిల్‌కు సహాయంగా ఉండేందుకు తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు వెంకటపతి రాజు వివరించాడు .హైదరాబాద్‌ క్రికెట్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని,అలాగే అపెక్స్‌ కౌన్సిల్‌ మహిళా క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం సంతోషకరమని పూర్ణిమ పేర్కొన్నారు.సలహా కమిటీకి నన్ను ఎంపిక చేయడం ద్వారా ఎపెక్స్‌ కౌన్సిల్‌ మహిళల క్రికెట్‌కు ప్రాధాన్యమిస్తుందని స్పష్టమైంది.తెలంగాణలో మహిళల క్రికెట్‌ అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తా అని పూర్ణిమ వెల్లడించారు.హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మార్చి 31న హెచ్‌సిఎ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే.