హుస్సేన్‌సాగర్‌ దుర్గందాన్ని తగ్గించేందుకు చర్యలు

CHIRANJEEVULU
CHIRANJEEVULU

హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో కాలుష్య జలాలను శుద్ది చేసి, దుర్గందాన్ని తగ్గించే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్లు హెచ్‌ఎండిఎ కమిషనర్‌ చిరంజీవులు తెలిపారు. గురువారం నెక్లెస్‌ రోడ్డులోని హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున ఉన్న బతుకమ్మ కుంటలో మరో రెండు వ్యర్థాల ఏరివేత యంత్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ హుస్సేన్‌సాగర్‌లోని నీటిని గతంలో ప్రజలు మంచినీటిగా ఉపయోగించే వారని, కాల క్రమంలో మూసి నది నుంచి వచ్చే మురికి నీరు తదితర వ్యర్థాలు కలువడంతో కులషితమైన దుర్గందపూరితమైందని తెలిపారు. అయితే హుస్సేన్‌సాగర్‌ నీటిని శుభ్రపరిచి, వ్యర్థాలను తొలగించి శుద్ది చేసే పనిని కొనసాగిస్తున్నామని తెలిపారు. సాగర్‌లో నాలుగు ప్రధాన కాలువల ద్వారా వచ్చి చేరుతున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని, నీటి శుద్ది ప్లాంట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే తమకు ప్రజలు కూడా తోడ్పాటు అందిస్తే ఫలితాలు తొందరగా వస్తాయని తెలిపారు. ప్రజలు కూడా వ్యర్థాలను మూసి నదిలో కలువకుండా సహకరించాలన్నారు. ఇప్పటి వరకు ఒక ట్రాష్‌ కలెక్టర్‌, అంఫిబియస్‌ ఎక్స్వ్టేర్‌ ద్వారా వ్యర్థాలు ఏరి వేసి వారమని, ఇప్పుడు అదనంగా మరో రెండు ఎస్కవేటర్లను ఏర్పాటు చేసి వ్యర్థాలను ఏరివేసే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని తెలిపారు. మరో రెండు మూడు నెలల్లో ఆ ప్రాంతంలోని వ్యర్థాలన్ని ఏరివేసి, రసాయన బబుల్స్‌ ద్వారా దుర్గందాన్ని నియంత్రిస్థామని తెలిపారు.
ఔషద మొక్కలు విశిష్టతను ప్రజలకు వివరించాలని సంజీవయ్య పార్కు దగ్గరలో హెచ్‌ఎండిఎ ద్వారా రెండు ఎకరాల విస్తీర్ణంలో 1.4కోట్ల రూపాయల ఖర్చుతో 314 ఔషద మొక్కలతో కూడి పార్కును అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. జలమండలి అభివృద్ధి పనుల వల్ల పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటంతో కొంత ఆలస్యమైందన్నారు. వచ్చే 15 ఆగస్టున ఔషద పార్కులోకి ప్రజలను అనుమతి ఇస్తామన్నారు. టాయిలెట్లు, పార్కింగ్‌ సౌకర్యం లాంటి అవసరమైన తుది ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని తెలిపారు. ఔషద పార్కులో అడవి ఆముదం గురువింద, అడవి మామిడి, బోడసరం, మాచపత్రి, బ్రహ్మి, మల్టీ విటమిన్‌, ఎలిఫింటో క్రిపర్‌, అనోట ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పిల్లల కోసం వైజ్ఞానిక పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పిల్లల వైజ్ఞానిక పార్కులో ఉందన్నారు. హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాలుమరింత ఆహ్లాద వాతావరణ కల్పించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఎకో పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే అత్యంత ఎత్తైన పెద్దదైన జాతీయ జెండాను ఎలాంటి అంతరాయాలు లేకుండా నిర్వహిస్తున్న ఘనత హెచ్‌ఎండిఎకు దక్కుతుందన్నారు.