హుండై మోటార్స్‌ నుంచి టుక్సానా ఎస్‌యువి

Hyundai Tucson SUV
Hyundai Tucson SUV

హుండై మోటార్స్‌ నుంచి టుక్సానా ఎస్‌యువి

న్యూఢిల్లీ,నవంబరు 14:హుండైమోటార్‌ ఇండియా నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న కొత్త ఎస్‌యువి టుక్సాన్‌ను విడుదలచేసింది. డిల్లీ ఎక్స్‌షోరూంధరలుగా 18.99 లక్షలుగా ప్రకటించింది. క్రెటా, శాంతాఫేలకు మద్యస్తంగా ఈ ధరలు ఉన్నట్లు నిపుణుల అంచనా. భారత్‌ లో టుక్సాన్‌బ్రాండ్‌ను రెండోసారి విదులచేసింది. మరిన్ని ఆధునిక ఫీచర్‌ను జోడించింది. 2.లీటర్‌ ఎన్‌యు యూనిట్‌, డీజిల్‌పరంగా 2.0 లీటర్‌ ఇ-విజిటి ఇంజన్‌ను ఏర్పాటుచేసింది. పెట్రోల్‌ ఇంజన్‌ 153హెచ్‌పి శక్తిని అందిస్తుంది. డీజిల్‌ ఇంజన్‌ 183 ఆశ్వికశక్తితో పనిచేస్తుంది. 6స్పీడ్‌ ఆటోమేటిక్‌, మ్యాన్యువల్‌గేర్‌ వ్యవస్థలో నడుస్తు న్నాయి. డీజిల్‌ 18.42 కిలోమీటర్లు, పెట్రోలు 13.03కిలోమీటర్లు మైలేజి ఇస్తుంది.ఆటోమేటిక్‌ వెర్షన్‌లో అయితే మైలేజి పెట్రోలు వాహనానికి 12.95 కిలోమీటర్లు ఇస్తుంది. డీజిల్‌ 16.36 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. టుక్సాన్‌లోకూడా అంతర్గతంగా అనేక ఫీచర్లను జోడించింది. ఐదుసీట్ల ఎస్‌యువిలో ఎనిమిది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ ఏర్పాటుచేసింది. ఆడియో, వీడియోనేవిగేషన్‌ వ్యవస్థలున్నాయి. యాంటిలాకింగ్‌ బ్రేకింగ్‌ వ్యవస్థతోపాటు ఎలక్ట్రా నిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ పంపిణీ వ్యవస్థను కూడా ఏర్పా టుచేసింది. టెలిస్కోపిక్‌ స్టీరింగ్‌ వీల్‌ సర్దుబాట్లు, కూల్డ్‌ గ్లోవ్‌బాక్స్‌ వంటివి కొత్తగా ఏర్పాటు చేసింది.