హీరో ఎలక్ట్రిక్‌నుంచి ఫ్లాష్‌ స్కూటర్‌

HEROELEC
HEROELEC

 

న్యూఢిల్లీ: హీరో ఎలక్ట్రిక్‌నుంచి కొత్తగా అందుబాటులో స్కూటర్‌ ఫ్లాష్‌ మార్కెట్‌కు వచ్చింది. తక్కువ ఖర్చుతో
కూడిన విద్యుత్‌ స్కూటర్‌ప్రీమియం బ్రాండ్‌నుంచిచవస్తుండటంతో ఉత్తమనాణ్యతతో ఉంటుందని కంపెనీ
వివరించింది. భారతీయ రోడ్లపై అత్యాధునిక టెక్నాలజీతో నడిచే కొత్త ఇ-వాహనంగా హీరోఫ్లాష్‌ స్కూటర్‌
ఉంటుందని చెపుతున్నారు. నీతిఆయోగ్‌ విద్యుత్‌ ద్విచక్రవాహనాలను ప్రజారవాణాకు వినియోగించాలన్న
లక్ష్యానికి తోడుగా ముందు టూవీలర్లను ప్రవేశపెట్టినట్లు చెపుతున్నది. వచ్చే రెండేళ్లలో పదిలక్షలకుపైబడి
ఇ-వాహనాలను ఉత్పత్తిచేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రభుత్వం ఇవాహనాలను కొనుగోలుకు
సబ్సిడీని కూడా అందిస్తోంది. విద్యుత్‌ 2వీలర్లపై రూ.7500 సబ్సిడీ లభిస్తున్నది. అలాగే హీరో
ఎలక్డ్రిక్‌ డీలర్లు అదనంగా రూ.7500 సబ్సిడీని ఫ్లాష్‌పై అందిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి షార్ట్‌
సర్క్యూట్‌ సమస్యలు లేకుండా వీటిని నడుపుకునే అవకాశం ఉంది. రెడ్‌బ్లాక్‌, సిల్వర్‌బ్లాక్‌ వంటి
రంగుల్లో ఇవి లభిస్తాయి. 250వాట్‌మోటార్‌, 48వోల్ట్‌, 20ఎహచ్‌, విఆర్‌ఎల్‌ఎ బ్యాటరీ
65 కిలోమీటర్లవరకూ ఒకసారి ఛార్జిచేస్తే వస్తుంది. హీరో వారంటీ రెండేళ్లపాటు ఉంటుందని
సిఇఒ సోహిందర్‌గిల్‌ వెల్లడించారు.