హాస్యనటులకు చిరు రూ.4లక్షల ఆర్థికసాయం

maa
maa

కమెడియన్‌ గుండు హనుమంతరావు కిడ్నీ సంబంధిత వ్యాధి బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి రూ.2లక్షల చెక్కును మా అధ్యక్షుడు శివాజీరాజా ద్వారా అందజేశారు. మా జాయింట్‌ సెక్రటరీ ఏడిద శ్రీరామ్‌ , కల్చరల్‌ కమిటీ చైర్మన్‌ సురేష్‌ కొండేటి, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ సురేష్‌ స్వయంగా అపోలో ఆసుపత్రికి వెళ్లి చెక్కు అందజేశారు. అనంతరం గుండు హనుమంతరావు తన ఆనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా చిరంజీవితోకాసేపు ఫన్‌లో ఉత్సాహంగా మాట్లాడారు. అదేవిధంగా మరో కమెడియన్‌ పొట్టి వీరయ్య ఆర్థిక పరిస్థితిని చిరంజీవి సతీమణి పత్రికల్లో చదవి చలించిపోయారు. తమవంతు సాయంగా వీరయ్య కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించారు. వీరయ్య మా కార్యాలయంలో శివాజీరాజా, ఏడిద శ్రీరామ్‌ చేతుల మీదుగా రూ.2 లక్షల చెక్కును అందుకున్నారు.