హాలీవుడ్‌ స్టంట్‌మాస్టర్‌

chiru still 150
CHIRANJEEVI

హాలీవుడ్‌ స్టంట్‌మాస్టర్‌

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి మోషన్‌ పోస్టర్‌ లాంచ్‌ అయిన సంగతి తెలిసిందే.. అమితాబ్‌, సుదీప్‌, విజ§్‌ు సేతపతి , నయనతార, వంటి స్టార్‌ నటీనటులను ప్రాజెక్టులోకి తీసుకున్న మెగాటీం. సినిమాను జాతీయస్థాయిఓల నిలబెట్టేలా ప్లాన్‌చేస్తున్నారు.. అంతేకాగా నాణ్యత విషయంలో కూడ సినిమా గొప్పస్తాయిలో ఉండాలని బెస్ట్‌క్రూను ఎంచకుకున్నారు మెగాస్టార్‌. ఇప్పటికే సంగీతం కోసం ఎఆర్‌ రెహమాన్‌ను ఎంచుకోగా, సినిమాటోగ్రఫీకోసం రవి వర్మన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా రాజీవన్‌ను తీసుకున్నారు.. ఇక స్వాతంత్య పోరాట నేపథ్యంలో నడిచే సినిమా కాబట్టి యాక్షన్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వాటిని అత్యుత్తమంగా తీర్చిదిద్దటానికి హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ టోనీ చింగ్‌ను సెలక్ట్‌చేసుకున్నారు. ఈయన గతంలో ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్న ‘స్పైడర్‌ మ్యాన్‌ సినిమాకు స్టంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.