హాలిడే ట్రిప్‌కు రావాల‌ని విరుష్క జోడికి ఆహ్వానం

virat, anushka
virat, anushka

కొలంబోః విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ కలిసి హాలీ డే ట్రిప్ కోసం తమ దేశానికి రావాలని విరాట్‌కు వీరాభిమాని అయిన పొరుగు దేశం మంత్రి కోరడం విశేషం. విరుష్క జోడీ శ్రీలంక దేశానికి విహారయాత్రకు వచ్చి తమ దేశ పర్యాటక ప్రాంతాలను ఆస్వాదించాలని లంక క్రీడల శాఖ మంత్రి దయాసిరి జయసేఖర కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విరుష్క దంప‌తులు కొద్దిరోజులు తమ దేశంలో సరదాగా గడపాలని కోరుతున్నా. వారికి వివాహం అయిన తరువాత మా దేశాన్ని సందర్శించలేదు. ఇక్కడ విహరించేందుకు ఇక్కడ ఎన్నో సుందరమైన ప్రదేశాలున్నాయి. అని దయాసిరి పేర్కొన్నారు. క్రీడల మంత్రి దయాసిరి..విరాట్ కోహ్లీకి అతిపెద్ద అభిమాని.