హార్వే బాధితులకు కార్పొరేట్‌ దిగ్గజాల భారీ విరాళాలు

haricane effect in texas
haricane effect in texas

వాషింగ్టన్‌: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రాన్ని ముంచెత్తిన హరికేన్‌ హార్వే ప్రజల దయనీయమైన పరిస్థితి చూసి చలించిపోయిన అక్కడ కార్పొరేట్‌ దిగ్గజాలు తమవంతు సాయం అందించడానికి ముందుకు వచ్చారు. ఇప్పటివరకు వివిధ కంపెనీలు చేసిన సాయం విలువ 170 మిలియన్‌ డాలర్లకు వరకు చేరుకుందని అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వెల్లడించింది. వాల్‌మార్ట్‌ 20 మిలియన్లు, వెరిజాన్‌ 10 మిలియన్లు, మైకేల్‌ డెల్‌ 36 మిలియన్ల డాలర్లు సహాయం చేశాయి. సహాయం కేవలం కరెన్సీ రూపంలోనే కాకుండా వస్తు రూపేణా అంటే వాషింగ్‌ మెషీన్లు, డ్రైయర్లు, ఇంకా గృహోపకరణాలు, వినియోగదారులకు క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపు గడువును పెంచాయి. అలాగే బాధిత ప్రాంతాలకు విచ్చేసే ఎన్జీఓ ప్రతినిధులకు, వాలంటీర్లకు ఉచితంగా ప్రయాణ సదుపాయాలను టెక్సాస్‌ ఎయిర్‌లైన్స్‌ కల్పించాయి.