హారర్‌ సినిమాలో విజ§్‌ు దేవరకొండ!

VIJAY222222
VIJAY

హారర్‌ సినిమాలో విజ§్‌ు దేవరకొండ!

 

ప్రేమ కథా చిత్రం సినిమాతో మారుతి హారర్‌ సినిమాల ట్రెండ్‌ కు శ్రీకారం చుట్టాడు. అప్పటినుండి టాలీవుడ్‌ లో హారర్‌ తో కూడిన కామెడీ సినిమాలు బాగా సక్సెస్‌ అవుతున్నాయి. అదిక సేఫ్‌ జోనర్‌ లా మారడంతో దర్శకనిర్మాతలు అటువంటి సినిమాలు చేయడానికి మక్కువ చూపుతున్నారు. హీరోలకు కూడా ఈ జానర్‌ సినిమాలు బాగా కలిసొస్తున్నాయి. నిన్న విడుదలయిన నిఖిల్‌ సినిమా ఎక్కడకిపోతావు చిన్నవాడా కూడా హారర్‌ సినిమానే. ఈ సినిమా నిఖిల్‌ కు మరో హిట్‌ తెచ్చిపెట్టింది. తాజాగా ఇదే జానర్‌ లో మరో సినిమా సిద్ధమవుతోంది. పెళ్ళిచూపులు చిత్రంతో హీరోగా సక్సెస్‌ అందుకున్న విజ§్‌ు దేవరకొండ ప్రస్తుతం ద్వారకా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తరువాత విజ§్‌ు హీరోగా యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్‌ లో ఓ హారర్‌ సినిమా రూపొందనుంది. కారులో దెయ్యం అనే కాన్సెప్ట్‌ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.