హాయిలాండ్‌ ధరను రూ.600కోట్లుగా ఖరారు చేసిన హైకోర్టు

High Court
High Court

హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ విషయంపై ఈరోజు హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. హాయిలాండ్‌ ను వేలం వేయడానికి ప్రణళికి సిద్దమైంది. హాయిలాండ్‌ కనీస ధర రూ.600కోట్లుగా ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. హా§్‌ులాండ్‌ విలువ ఎంత ఉంటుందనే దానిపై ప్రభుత్వం. సీఐడీ, ఎస్‌బీఐలు ధరను న్యాయస్థానానకి ఇచ్చారు. తరువాత హాయిలాండ్‌ వేలం వేయాలనలి ఎస్‌బీఐని హైకోర్టు ఆదేశించింది. హాయిలాండ్‌ లో కొంతభాగం గతంలోనే ఎస్‌బీఐ వద్ద తనఖా పెట్టినందున.. ఆ ఆస్తిని పూర్తిగా వేలం వేసిన తర్వాత ఎస్‌బీఐకి ఎంత ఇవ్వాలి.. అగ్రిగోల్డ్‌ ఖాతాదారులకు ఎంత ఇవ్వాలి అనే విషయాలను ఖరారు చేస్తామని హైకోర్టు పేర్కొంది. ఆస్తుల వేలంపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, బిడ్డర్ల వివరాలను ఫిబ్రవరి 8లోపు సీల్డ్‌కవర్‌లో సమర్పించాలని ఎస్‌బీఐకి సూచించింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుపై తొలుత ముందుకొచ్చిన జీఎస్‌ఎల్‌ గ్రూపు ఆ తర్వాత వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో జీఎస్‌ఎల్‌ ప్రతిపాదన ఉపసంహరణకు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. హైకోర్టు సమయాన్ని వృథా చేసినందున జీఎస్‌ఎల్‌కు రూ.3కోట్ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.