హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేస్తా

Manikyala rao
Manikyala rao

ప.గో: ఏపి ఎమ్మెల్యె, మాజీ మంత్రి మాణిక్యాలరావు తన ఎమ్మెల్యె పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. కొన్ని షరతులతో కూడిన రాజీనామా లేఖను సిఎం చంద్రబాబుకు మాణిక్యాలరావు పంపించారు. 15 రోజుల్లో హామీలు అమలు చేయాలని, లేదంటే రాజీనామను స్పీకర్‌కు పంపాలని ఆయన పేర్కొన్నారు. హామీల అమలుకు చర్యలు చేపట్టకపోతే అమరణ నిరాహారదీక్ష చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి శాసన సభలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని మాణిక్యాలరావు విమర్శించారు.