హామీలపై చర్చ‌కు కేంద్రం నుంచి ఏపి సిఎస్‌కు పిలుపు

AP CS Dinesh Kumar
AP CS Dinesh Kumar

న్యూఢిల్లీ: ఏపి విభజన హామీలపై చర్చించేందుకు సమగ్ర సమాచారంతో ఈ నెల 23న ఢిల్లీకి రావాలని ఏపి సీఎస్‌కు కేంద్ర హోంశాఖ నుంచి ఆహ్వానం వచ్చింది. ఈ సమావేశంలో ప్రధానంగా విశాఖ రైల్వేజోను, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, రెవిన్యూ లోటు, దుగరాజపట్నం పోర్టు , 9,1వ విభజన షెడ్యూల్‌ సంస్థల విభజనపై చర్చ జరుగుతున్నందున ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ఆహ్వానించారు.