హాజ్ యాత్రికుల కోటా మ‌రో 5వేలు

Mukhtar abbas Naqvi
Mukhtar abbas Naqvi

న్యూఢిల్లీ: భారత్ హజ్ యాత్రికుల కోటా పెంచుతూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకున్నది. అదనంగా 2017 కోటాలో మరో ఐదువేల మంది హజ్ యాత్రకు వెళ్లవచ్చునని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండేండ్లలో భారత్ హజ్ యాత్రికుల కోటా పెంచడం ఇది రెండోసారి అని పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో హజ్ యాత్రికుల సంఖ్య పెంచడం చరిత్రాత్మకం అని అన్నారు. ఈ మేరకు ఆయన సౌదీ అరేబియా రాజు సల్మాన్‌బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, సౌదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు