హాకీ టోర్నీలో భారత్‌ విజయం

HOCKEY1

హాకీ టోర్నీలో భారత్‌ విజయం

ఇఫో: ప్రతిష్టాత్మక అజ్లాన్‌ షా హకీ టోర్నీలో భారత హాకీ జట్టుకు స్ఫూర్తి దాయకమైన గెలుపు లభించింది. టీమిండియా స్ట్రైకర్‌ మన్‌దీప్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో మాయాజాలం చేశాడు. జపాన్‌పై తిరుగులేని విజయం అందించాడు.తొలి క్వార్టర్‌లో ఎనిమిదవ నిముషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌కు రూపిందర్‌పాల్‌ సింగ్‌ అద్బుత గోల్‌గా మలిచాడు.భారత్‌ను 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.ఆ తరువాత టీమిండియా డిపెండర్లు జపాన్‌దాడులను తిప్పికొట్టలేకపోయారు.కజుమ మురట,హైటా హెసిహర,జెన్కీ,మిటాని, ఒక్కొ క్కరు ఒక గోల్‌ చేసి భారత్‌ను 1-3తో వెనక్కి నెట్టారు.భారత్‌ పరాజయం నుంచి తప్పించుకోవా లంటే చివరి పది నిముషాల్లో మూడు గోల్స్‌ అవరసం.అయితే ఒత్తిడి మధ్య మన్‌దీప్‌సింగ్‌ అద్భుతం చేశాడు.45 నిముషాలు,51 నిము షాలు,58 నిముషాల్లో మూడు గోల్స్‌ సాధించి టీమిండియాకు తిరుగులేని విజయం సాధించాడు.